ఐఫోన్‌-7 రేటెంతో తెలుసా ?

i-phone-7-price

టెక్నాలజీ రంగంలో ప్ర‌సిద్ది చెందిన ఆపిల్ కంపెనీకి ఓ విశిష్ట‌మైన ప్ర‌త్యేకత ఉంది. ఆపిల్ అంటే ఓ బ్రాండ్‌.. అది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఈ ఫోన్ల‌ను కూడా అతి కొద్ది మంది మాత్ర‌మే కొన‌గ‌లుగుతారు అనేది కూడా వాస్త‌వ‌మే. వీటి ధ‌ర ఎంత ఎక్కువ ఉంటుందో అంతే క్వాలిటీకి ప్రాధాన్యం ఇస్తారు. ఇండియాకు అతి త్వ‌ర‌లోనే ఐఫోన్-7 రానుంది. నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ గా పేరొందిన ఐఫోన్-7 ఈరోజు (సెప్టెంబర్ 7న) అంతర్జాతీయంగా విడుదల అవుతుంది. మరో 19 రోజుల్లో భారత్ కు ఇది రానుంది. సెప్టెంబర్ 26న ఐఫోన్-7ను భారత్ లో విడుదల చేయనున్నారు.

శాన్ ఫ్రాన్సిస్కోలోని గ్రహం బిల్ సివిక్ ఆడిటోరియంలో బుధవారం అట్టహాసంగా జరగనున్న వేడుకలో ఐఫోన్-7ను ఆపిల్ కంపెనీ ఆవిష్కరించనుంది. అంతర్జాతీయంగా ఆపిల్-7 బేస్ మోడల్ (32) జీబీ ధరను 749 డాలర్లుగా నిర్ణయించారు. భారత్ లో దీని ధర సుమారు రూ. 63వేలు ఉండే అవకాశముంది. అమెరికాలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ మధ్యలో ఐఫోన్-7 అమ్మకాలు ప్రారంభమవుతాయని, భారత్ కు వచ్చేసరికి సెప్టెంబర్ 26నుంచి ఐఫోన్-7 మార్కెట్ లో లభిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, రెండో అతిపెద్ద స్మార్ట్ మార్కెట్ అయిన భారత్ పై ఆపిల్ ఈ మధ్య ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్ లోనే యాపిల్ అత్యధిక అమ్మకాలు జరిపింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారత్ లో ఐఫోన్ అమ్మకాలు 51శాతం పెరిగాయి. అంతేకాకుండా గత ఏడాది తొలిసారిగా భారత్ లో ఆపిల్ కంపెనీ ఒక బిలియన్ డాలర్ మార్క్ ఆదాయాన్ని సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *