ప్రీ రివ్యూ: గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి

టైటిల్‌: గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి
బ్యాన‌ర్‌: హిస్టారిక‌ల్ మూవీ
న‌టీన‌టులు:యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రేయ శరన్, హేమమాలిని, కబీర్ బేడీ త‌దిత‌రులు
సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్
మ్యూజిక్‌: చిరంతన్ భట్
ఆర్ట్‌: భూపేష్ భూపతి
పాట‌లు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
డైలాగ్స్‌: సాయిమాధవ్ బుర్ర
ఫైట్స్‌: రామ్-లక్ష్మణ్
సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు
సమర్పణ: బిబో శ్రీనివాస్
నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు
ద‌ర్శ‌క‌త్వం: జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ (క్రిష్‌)
ర‌న్ టైం: 2 గంట‌ల 12 నిమిషాలు
సెన్సార్ స‌ర్టిఫికెట్‌: యూ/ఏ
రిలీజ్ డేట్‌: 12 జ‌న‌వ‌రి, 2016

తెలుగుజాతి గ‌ర్వించ‌ద‌గ్గ నాటి త‌రం న‌టుడు, న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క రామారావు వార‌సుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన నంద‌మూరి బాల‌కృష్ణ టాలీవుడ్ అగ్ర హీరోల‌లో ఒక‌డిగా నాలుగు ద‌శాబ్దాలుగా తెలుగు వెండితెర‌పై హీరోగా మెరుపులు మెరిపిస్తున్నాడు. తాత‌మ్మ‌క‌ల‌తో వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన బాల‌య్య ఈ నాలుగు ద‌శాబ్దాల్లో వంద సినిమాల‌కు చేరువ‌య్యాడు. 99 సినిమాలు పూర్తి చేసుకున్న బాల‌య్య త‌న 100వ సినిమాగా ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో న‌టించాడు. టాలీవుడ్‌లో గ‌మ్యం – వేదం – కృష్ణంవందే జ‌గ‌ద్గురుం – కంచె సినిమాల‌తో విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ డిఫ‌రెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ హిస్టారిక‌ల్ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 12న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా క‌థ‌, క‌థ‌నం, డైరెక్ష‌న్‌, సాంకేతిక‌త ఎలా ఉంటాయో డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ ప్రీ రివ్యూలో చూద్దాం.

స్టోరీ అంచ‌నా :
అఖండ భార‌త‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. శాత‌క‌ర్ణి త‌న త‌ల్లి గౌత‌మీ పేరును త‌న పేరుకు ముందు పెట్టుకుని పాల‌న చేసే స‌రికొత్త సంప్ర‌దాయానికి తెర‌దీస్తాడు. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధానిగా ఉన్న అమ‌రావ‌తి (గుంటూరు జిల్లాలో ఉన్న ప్ర‌ముఖ పంచారామ క్షేత్రం) ని రాజ‌ధానిగా చేసుకుని పాలించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు త‌న సామ్రాజ్య విస్త‌ర‌ణ‌తో పాటు పొరుగు రాజ్యాల నుంచి సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో భీక‌ర‌మైన యుద్ధాలు చేశాడు. ఈ శాత‌వాహ‌న సామ్రాజ్యాన్ని మొత్తం 30 మంది రాజులు పాలించారు. వీరిలో శాత‌వాహ‌నుడు అఖండ భార‌తాన్ని ఒకేతాటిమీద‌కు తెచ్చి పాలించాడు. ఈ పాల‌న‌లోనే గ్రీకుల దండ‌యాత్ర జ‌రుగుతుంది. ఇటు స్వ‌దేశంలో శాత‌క‌ర్ణి వ్య‌తిరేక‌త శ‌క్తుల‌ను, అటు గ్రీకుల దండ‌యాత్ర‌ను శాత‌క‌ర్ణి ఎలా తిప్పికొట్టి ? ఈ అఖండ భార‌తావ‌నిని ఏకం చేశాడు అన్న‌దే ఈ సినిమా స్టోరీ. వాస్త‌వానికి శాత‌క‌ర్ణికి సంబంధించి చాలా చ‌రిత్రే ఉన్నా క్రిష్ అందులో యుద్ధాల ద్వారా శాత‌క‌ర్ణి రాజ్యాన్ని ఏకం చేయ‌డం, విదేశీ దండ‌యాత్ర‌ల‌ను తిప్పికొట్ట‌డం వ‌ర‌కే చూపించి ఉంటాడ‌ని స‌మాచారం.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిగా బాల‌య్య విశ్వ‌రూప‌మే చూపించాడు. ఈ విష‌యం ట్రైల‌ర్ చూస్తేనే స్ప‌ష్ట‌మ‌వుతుంది. బాల‌య్య డైలాగుల‌తోను, వార్ స‌న్నివేశాల్లోను న‌ట విశ్వ‌రూపం చూపించాడు. ఇలాంటి హిస్టారిక‌ల్ సినిమాలు, పౌరాణిక సినిమాల్లో బాల‌య్య గ‌తంలో ఎన్నోసార్లు న‌టించారు. దీంతో శాత‌క‌ర్ణిగా బాల‌య్య మ‌రోసారి విజృంభించాడ‌నే టాక్ వ‌స్తోంది. ఇక వ‌శిష్ట దేవిగా శ్రియ సైతం అద్భుతంగా చేసింద‌ని ట్రైల‌రే చెపుతోంది. ఇక శాత‌క‌ర్ణి త‌ల్లి గౌత‌మిగా బాలీవుడ్ డ్రీమ్ గ‌ర్ల్ హేమ‌మాలిని పాత్ర హిస్ట‌రీలో నిలిచిపోయేలా ఉంద‌ట‌. ఇక శాత‌క‌ర్ణి కుమారుడు పులోమావి క్యారెక్ట‌ర్ ఉంటుందా ? ఉంటే ఈ రోల్‌లో బాల‌య్య త‌న‌యుడు మోక్షు వెండి తెర‌పై తొలిసారిగా స‌డెన్‌గా ఎంట్రీ ఇస్తాడా ? లేదా ? అన్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్సే. ఇక ఈ హిస్టారిక‌ల్ మూవీలో మిగిలిన పాత్ర‌ల‌కు కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉండ‌నున్నాయి.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్స్ అంచ‌నా:
శాత‌క‌ర్ణిలో అన్ని సాంకేతిక విభాగాలు హైలెట్ కానున్నాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ, రామ్‌-ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్‌, చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌, భూపేష్ భూప‌తి ఆర్ట్‌, సిరివెన్నెల సాహిత్యం, బుర్రా సాయిమాధ‌వ్ ప‌దునైన డైలాగ్స్ ఇలా అన్ని సినిమాకు భారీ త‌నాన్ని తెస్తాయ‌ని ట్రైల‌ర్లు, స్టిల్స్ చెపుతున్నాయి. ఇక వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు నిర్మాణ విలువ‌లు భారీ రేంజ్లో క‌న‌ప‌డుతున్నాయి. నిర్మాణ విలువ‌ల‌కు వంక పెట్ట‌లేని విధంగా ఉంటాయ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

క్రిష్ డైరెక్ష‌న్ అంచ‌నా :
తెలుగు సినిమా టేకింగ్‌ను మ‌రో మెట్టు ఎక్కించే ద‌ర్శ‌కుల జాబితాలో క్రిష్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. క్రిష్ ఒక్కో సినిమాకు ఎవ్వ‌రికి అంద‌నంత ఎత్తుకు చేరుకుంటున్నాడు. తాజాగా శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాక రాజ‌మౌళికి పోటీ ఇచ్చే టాలీవుడ్ ద‌ర్శ‌కుడు అని కూడా సోష‌ల్ మీడియాలో తెలుగు సినీజ‌నాలు ఆకాశానికి ఎత్తేశారు. కంచెతో ఇలాంటి సినిమాల‌ను తాను ఎలా డీల్ చేస్తాడో ఫ్రూవ్ చేసుకున్న క్రిష్ శాత‌క‌ర్ణి లాంటి హిస్టారిక‌ల్ సినిమాను కేవ‌లం 8 నెల‌ల్లో రూ.55 కోట్ల బ‌డ్జెట్‌తో క్వాలిటీతో తెర‌కెక్కించి శ‌భాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధం 20 నిముషాలు ఉండటమే కాకుండా అత్యంత భారీ స్థాయిలో గ్రాఫిక్స్ హైలెట్ అయ్యేలా క్రిష్ తెర‌కెక్కించాడ‌ట‌.

ప్రీ రిలీజ్ బిజినెస్ :
శాత‌క‌ర్ణి సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక శాత‌క‌ర్ణి శాటిలైట్ రైట్స్‌ను ఓ ప్ర‌ముఖ ఛానెల్ రూ.8 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ‌లో ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌డంతో సినిమాకు రిలీజ్‌కు ముందే రూ.20 కోట్ల భారీ లాభం చేకూరిన‌ట్ల‌య్యింది. సో ఈ లెక్క‌న శాత‌క‌ర్ణి రిలీజ్‌కు ముందే చాలా వ‌ర‌కు సేఫ్ జోన్‌లోకి వ‌చ్చిన‌ట్ల‌య్యింది.

డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ శుభాకాంక్ష‌లు :
యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 100వ సినిమా గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి సూప‌ర్ హిట్ అవ్వాల‌ని కోరుకుంటూ బాల‌య్య‌తో పాటు గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి చిత్ర యూనిట్‌కు, సంబ‌రాలకు సిద్ధ‌మైన నంద‌మూరి అభిమానుల‌కు డెక్క‌న్ రిపోర్ట్‌.కామ్ త‌ర‌పున శుభాకాంక్ష‌లు.

గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి మూవీ రివ్యూ, ఈ సినిమాపై ఇత‌ర వార్త‌ల కోసం చూస్తూనే ఉండండి డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్‌

Read More:

ముద్ర‌గ‌డ‌కు అదిరిపోయే షాక్‌

పార్టీ మార్పుపై చిరు సిగ్న‌ల్స్‌

కోహ్లీ – స‌ల్మాన్‌కు జియో షాక్‌

వీడియో: దుమ్ము రేపుతోన్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి లీక్‌డ్ వీడియో

వీడియో: మంచు విష్ణుకు లైవ్‌లో వార్నింగ్ ఇచ్చిన మోహ‌న్‌బాబు

నారాయ‌ణ‌మూర్తికి రామోజీ సాయం వెన‌క అస‌లు సీక్రెట్ ఇదే

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *