టీఆర్ఎస్ లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

trs-45678

తెలంగాణలో అధికార పార్టీలో అక్కడక్కడా అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు తీవ్రంగానే ఉన్నాయనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. మిగతా చోట్ల ఈ వివాదం ఏ రకంగా ఉన్నా… వరంగల్ జిల్లాలో మాత్రం ఇది కాస్త తీవ్రతరం అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వరంగల్ నగరానికి చెందిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్… వరంగల్ ఎంపీగా ఎన్నికైన పసునూరి దయాకర్ కు కొంతకాలంగా అస్సలు పొసగటం లేదని టాక్. జనవరి ఒకటో తేదిన పసునూరి దయాకర్ పేరుతో ఫ్లెక్సీలు వెలియడం… దాన్ని వినయ్ భాస్కర్ తప్పుబట్టడంతో దయాకర్ అప్పటికప్పుడే జరిమానా కట్టడంతో వీరి మధ్య విభేదాలు ఇంకా అలాగే ఉన్నాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఇదంతా సరదాగా జరిగిన సంఘటన మాత్రమే అని అక్కడున్న వారు చెబుతున్నా…వీరి మధ్య విభేదాలు పెరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. దయాకర్ కొండా సురేఖ వర్గంతో సన్నిహితంగా ఉండటం వల్లే వినయ్ భాస్కర్ కు దయాకర్ కు మధ్య గ్యాప్ రావడానికి కారణమైందని కొందరు చర్చించుకుంటున్నారు. మరోవైపు తనను వినయ్ భాస్కర్ లెక్క చేయడం లేదనే కారణంగా దయాకర్ కూడా ఆయనపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. మరి… వరంగల్ జిల్లాలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య పెరిగిన ఈ గ్యాప్ ను తగ్గించేందుకు టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారిస్తుందా లేక ఇష్యూను లైట్ తీసుకుంటుందా అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *