పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్ ?

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి… మరో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా ? ఇప్పటివరకు మన దేశంలో దాదాపు అలాంటి ప్రయోగం జరగలేదనే చెప్పాలి. అయితే ఒకప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగిన షీలా దీక్షిత్… ప్రస్తుతం యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఆమె అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని సర్వేలు తేల్చేశాయి. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా ఉన్న ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్… పంజాబ్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి సరికొత్త వ్యూహాంతో ముందుకు రాబోతున్నట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

పంజాబ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా…కేజ్రీవాల్ ను సీఎం అభ్యర్థిగా భావించి ఆప్ కు ఓటు వేయాలని కోరడంతో… కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అభ్యర్థిగా నిలవబోతున్నారా అనే ప్రచారం జోరందుకుంది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఎదుర్కోవడానికి తమ దగ్గర డబ్బు లేదని ఈ మధ్య వ్యాఖ్యానించిన కేజ్రీవాల్… పంజాబ్ లో ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి ఈ రకమైన ఎత్తుగడ వేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సిసోడియా వ్యాఖ్యలే నిజమైతే… పంజాబ్ ఎన్నికలు రసవత్తరమైన టర్న్ తీసుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ కు అంతో ఇంతో ఆశలు ఉన్న పంజాబ్ విషయంలో కేజ్రీవాల్ ఈ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తే… ఆ పార్టీకి అదిఅనుకోని దెబ్బే అవుతుందని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *