జేసీ బ్రదర్ షాకింగ్ ప్లాన్ !

jc-45678

అనంతపురం జిల్లాకు చెందిన జేసీ సోదరులు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి చరిత్ర పెద్దదే. ఒకప్పుడు కాంగ్రెస్ లో చక్రం తిప్పిన ఈ ఇద్దరు… ప్రస్తుతం టీడీపీలో ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో కొనసాగుతున్నారు. అనంతపురం ఎంపీగా దివాకర్ రెడ్డి కొనసాగుతుంటే… ఇంతకాలం జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఏలిన తాడిపత్రి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి. కొన్ని దశాబ్దాల నుంచి తాడపత్రికి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన జేసీ సోదరుల ఆధిపత్యానికి గండి కొట్టేందుకు పక్కా వ్యూహాంతో ముందుకు సాగుతున్న వైసీపీ… ఇప్పటి నుంచే అక్కడ వైసీపీ తరపున బలమైన ప్రత్యర్ధి తిమ్మంపల్లి పెద్దారెడ్డిని తయారు చేస్తోంది.

పెద్దారెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్టు గమనించిన జేసీ ప్రభాకర్ రెడ్డి… ఆయనను దెబ్బకొట్టేందుకు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టు అనంతపురం రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పెద్దారెడ్డి సొంత ఊరు అయిన తిమ్మంపల్లిలోనూ ఉంటూ తన ప్రత్యర్థి ఎత్తులను ఎప్పటికప్పుడు గమనించాలని ప్లాన్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి… ఇందుకోసం అక్కడ సొంత ఇల్లును నిర్మించుకుంటున్నారని సమాచారం. మొదట తిమ్మంపల్లిలో నిర్మిస్తున్న పెద్ద ఇల్లు ఎవరిదనే విషయంపై సస్పెన్స్ కొనసాగినా… ఆ తరువాత అది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు అని తెలియడంతో… ఆయన రాజకీయ ఎత్తు గురించి తాడిపత్రిలో సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రత్యర్థి ఊరిలోనే కొత్త ఇల్లు కట్టుకున్న జేసీ బ్రదర్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *