వైసీపీ ఎమ్మెల్యే నాలుక కోస్తాన‌ని టీడీపీ ఎంపీ వార్నింగ్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ప‌దే ప‌దే టార్గెట్ చేసి సెటైర్లు వేస్తూ ఎద్దేవా చేసే టీడీపీ సీనియ‌ర్ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి ఈ రోజు మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు సాక్షిగా జ‌గ‌న్‌ను ఏకీ పారేశారు. క‌డ‌ప‌ జిల్లా పైడిపాలెంలో గండికోట‌ ఎత్తిపోతల ప‌థ‌కాన్ని బుధ‌వారం చంద్ర‌బాబు ప్రారంభించారు. ఇక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో జేసీ మాట్లాడుతూ జ‌గ‌న్‌తో పాటు త‌న‌పై జానీవాక‌ర్‌రెడ్డి అని విమ‌ర్శ‌లు చేసిన క‌డ‌ప జిల్లా రాయ‌చోటి ఎమ్మెల్యే గ‌డికోట శ్రీకాంత్ రెడ్డిని ఓ ఆటాడుకున్నారు.

జ‌గ‌న్ తాత రాజారెడ్డి తెల్లారితే ఎవ‌రిని న‌ర‌కాలా ? అన్న ఆలోచ‌న‌లో ఉండేవార‌ని..ఇప్పుడు జ‌గ‌న్‌కు కూడా అదే మ‌న‌స్తత్వం వ‌చ్చింద‌ని విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే అంద‌రూ మ‌ర్చిపోయిన ర‌క్త‌పాతాన్ని తిరిగి రేపేందుకే జ‌గ‌న్ క‌డ‌ప జిల్లా ఇన్‌చార్జ్‌గా ర‌క్త‌చ‌రిత్ర నేప‌థ్యం ఉన్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని ఇన్‌చార్జ్‌గా నియ‌మించార‌ని జేసీ అన్నారు.

ఇక శ్రీకాంత్‌రెడ్డి ఇటీవ‌ల త‌న నాలుక కోస్తాన‌ని అన్నార‌ని..శ్రీకాంత్‌కు నిజంగా అంత ద‌మ్ము ఉందా ? అని జేసీ ప్ర‌శ్నించారు. “ఎవడ్రా వాడు శ్రీకాంత్ రెడ్డి? నా నాలుక కోస్తాడా? అరేయ్ నీ ఊరికి వస్తా. దమ్ముంటే నన్ను టచ్ చేయి చాలు” అంటూ నిప్పులు చెరిగారు.

ఇక త‌న‌ను జానీవాక‌ర్ అన్న‌మాట‌పై జేసీ స్పందిస్తూ త‌న ఫ్యామిలీలో ఎవ్వ‌రికి మందు తాగే అల‌వాటు లేద‌ని, తాను ఎవ్వ‌రి బూట్లు నాక‌న‌ని జేసీ శ్రీకాంత్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. చంద్ర‌బాబు స్టేజ్‌మీద ఉండ‌డంతో జేసీ మ‌రింత రెచ్చిపోయారు. ఇక ఫైన‌ల్‌గా జేసీ 2019 ఎన్నిక‌ల్లో పులివెందుల‌లో టీడీపీ అభ్య‌ర్థిని గెలిపించాల‌ని చెప్ప‌డం గ‌మనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *