జంపింగ్ ఎమ్మెల్యే ‘మంత్రి’ కలలు

విజయవాడ నగరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టీడీపీలో చేరడంపై అప్పట్లో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మంత్రి పదవి ఇస్తారనే హామీతోనే ఆయన వైసీపీని వదలి టీడీపీలోకి వచ్చారని ప్రచారం జరిగింది. జలీల్ ఖాన్ సైతం…మైనార్టీలకు ఒక మంత్రి పదవి కావాలని పలు సందర్భాల్లో ఓపెన్ గానే వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటివరకు చంద్రబాబు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు పూనుకోకపోవడంతో… జలీల్ ఖాన్ ఆశలు నెరవేరలేదు. అయితే ఆయన మాత్రం తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని… రావాలని గట్టిగా కోరుకుంటున్నట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. తాజాగా తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన మరోసారి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

20 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినా జగన్‌ ఎందుకు వెళ్లారో అడగలేదని… అలాంటి వ్యక్తి ప్రతిపక్షనాయకుడిగా ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన జలీల్‌ఖాన్‌… చంద్రబాబుపై ఆరోపణలు చేసిన కేవీపీని బట్టలూడదీసి కొడితే ఎంత దోచుకున్నాడో బయటపడుతుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. పనిలో పనిగా కేబినేట్ విస్తరణలో మైనార్టీకి మంత్రికి పదవి ఇవ్వాలని చెప్పిన జలీల్ ఖాన్… అది తనకే వస్తుందని వేదిక మీదే అక్కడున్న వారితో చెప్పడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. మొత్తానికి మంత్రి పదవి కోసం కలలుకంటున్న జలీల్ ఖాన్ ఆశలు నెరవేరతాయా లేదా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *