టార్గెట్ పులివెందుల… జగన్ ఉక్కిరిబిక్కిరి ?

ys-jagan-34567

ఇప్పటిదాకా ఒక లెక్క… ఇప్పుడు ఒక లెక్క అనేలా జగన్ ను టార్గెట్ చేస్తోంది ఏపీలోని టీడీపీ. వినడానికి ఇదేదో సినిమా డైలాగ్ తరహాలో ఉన్నా… టీడీపీ వ్యూహాలను చూస్తుంటే ఇదే నిజమనిస్తోంది. కొన్నేళ్ల నుంచి జగన్ ను ఎదుర్కోవడానికి రకరకాల వ్యూహాలు అనుసరిస్తున్న టీడీపీ… ఇప్పుడు ఆయనను ఏకంగా సొంత నియోజకవర్గంలోనే టార్గెట్ చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పులివెందులకు సాగునీటిని అందించడం ద్వారా అక్కడ ఎంతోకొంత మైలేజీని సంపాదించుకున్న టీడీపీ… ఇక ముందు కూడా పులివెందుల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యింది. ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని ముందు పెట్టి… అక్కడ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తోంది టీడీపీ.

అధికార పార్టీ ఊహించని విధమైన వ్యూహాన్ని అమలు చేస్తుండటంతో… రాష్ట్రవ్యాప్తంగా పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కువగా సొంత ఇంటిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన తన సొంత నియోజకవర్గానికి చెందిన నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అంతకుముందు పులివెందుల నాయకులను అంతగా పట్టించుకోని జగన్… ఈ మధ్య మాత్రం వారితో ఎక్కువగా చర్చలు జరుపుతున్నారట. సొంత నియోజకవర్గంలో పార్టీ పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఆయన వారికి సూచనలు ఇస్తున్నట్టు సమాచారం. మొత్తానికి టీడీపీ నయా వ్యూహాంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టే కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *