కర్నూలుపై పట్టు… జగన్ పోరాటం !

ఆంధ్రప్రదేశ్ లో కడప తరువాత ప్రతిపక్ష వైసీపీకి అంతగా పట్టున్న జిల్లా ఏది అంటే ఎవరికైనా ముందుకు గుర్తొచ్చేది కర్నూలు జిల్లానే. కర్నూలు జిల్లాలో 80 శాతానికి సీట్లను తన సొంతం చేసుకున్న జగన్ పార్టీ… జిల్లాపై తన పార్టీకి ఎంత పట్టు ఉందో నిరూపించుకుంది. అయితే కొన్నేళ్లుగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో జగన్ పార్టీ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, కిందిస్థాయి నాయకులు అధికార టీడీపీలో చేరిపోయారు. మరికొందరు నాయకులు సైతం వారి దారిలోనే ప్రయాణించే అవకాశం ఉండటంతో… నష్టనివారణ చర్యలు చేపట్టాలని భావించిన వైసీపీ అధినేత జగన్… అందుకోసమే జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

కొద్ది రోజులుగా కర్నూలు జిల్లా పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డి… కర్నూలు జిల్లాలో ఇంకా పార్టీని నమ్ముకుని ఉన్న క్యాడర్ లో విశ్వాసం నింపే ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు. అయితే జగన్ యాత్రలో చాలామంది వైసీపీ నేతలు ఆయనకు ముఖం చాటేస్తున్నారని… వైసీపీ ముఖ్యనేతలు ఎంతగా బుజ్జగిస్తున్నా వారు జగన్ యాత్రకు రావడం లేదని తెలుస్తోంది. మరోవైపు తన యాత్రకు జనసమీకరణ చేసే బాధ్యతను జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు అప్పగించారని… అది వారికి తలకు మించిన భారంగా మారిందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి కర్నూలు జిల్లాపై పట్టుకోసం జగన్ చేస్తున్న పోరాటం ఎంతవరకు ఫలిస్తుందోచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *