మెగా ఫ్యాన్స్ దెబ్బ‌కు చిత్త‌యిన థియేట‌ర్‌

mega-fans-4567

మెగా ఫ్యాన్స్‌ అభిమానం హద్దు మీరింది. చిరు 9 సంవ‌త్స‌రాల భారీ గ్యాప్ త‌ర్వాత న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాను అర్ధ‌రాత్రే చూసేయాల‌ని చాలా మంది అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్‌ పై దాడికి దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లూరు శ్రీనివాసా థియేట‌ర్‌లో చోటుచేసుకుంది.

ఈ సినిమాకు అర్ధ‌రాత్రే ప్రీమియ‌ర్ షో వేస్తున్న‌ట్టు థియేట‌ర్ యాజ‌మాన్యం చెప్ప‌డంతో మెగా అభిమానులు భారీ ఎత్తున టిక్కెట్లు కొనుక్కుని అర్ధ‌రాత్రికే థియేట‌ర్‌కు చేరుకున్నారు. అయితే బుధవారం తెల్లవారుజాము వరకూ బెనిఫిట్‌ షో వేయకపోవడంతో అభిమానులు రెచ్చిపోయారు.

థియేటర్‌ లోని కుర్చీలతో పాటు స్క్రీన్‌ ను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్‌ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఖైదీ నెం.150 సినిమా చూడాలని ఎంతో ఆశతో తాము థియేటర్ ముందు రాత్రంతా పడిగాపులు కాస్తే, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అభిమానులు ఆరోపించారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా ఖైదీ నెంబర్‌ 150 చిత్రం బుధ‌వారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

Read More:

రివ్యూ: ఖైదీ నెంబ‌ర్ 150

శాత‌క‌ర్ణి సీక్వెల్ క‌థ ఇదే..!

” ఖైదీ నెంబ‌ర్ 150 ” లో అదే పెద్ద మైన‌స్‌

ఖైదీ కోసం మెగా ఫ్యామిలీ ఏం చేసిందో తెలుసా

వీడియో : మోడీకి సవాలు విసురుతున్న బుడ్డోడు

Khaidi No.150 review, rating, live updates & public response

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *