జగన్ తమ్ముడికి చంద్రబాబు షాక్

ఎవరూ ఊహించని విధంగా వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు సాగునీటి అందించే ప్రాజెక్టును పూర్తి చేసిన టీడీపీ ప్రభుత్వం… బుధవారం అధికారికంగా పులివెందులకు సాగునీటిని విడుదల చేసింది. పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు… పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. ఆ తరువాత జరిగిన సభలో కడప ఎంపీ వైసీపీ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ. 650 కోట్లకు పైగా ఖర్చు చేశారని… ఈ క్రెడిట్ అంతా వైఎస్ కే దక్కుతుందని వ్యాఖ్యానించేలా వైసీపీ ఎంపీ కామెంట్స్ చేశారు. అయితే వెంటనే స్టేజ్ మీద ఉన్న చంద్రబాబు… అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చినంత పని చేశారు.

వైఎస్ హయాంలో వంద కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారని… అన్ని కోట్ల నిధులు ఎందుకు ఖర్చు చేశారనే దానిపై విచారణ చేపడతామని సభా వేదికలోనే చంద్రబాబు ప్రకటించడంతో… వైసీపీ ఎంపీ పూర్తిగా సైలెంటయ్యారు. మరోవైపు ఈ ప్రాజెక్టు కోసం వైఎస్ భారీగా ఖర్చు చేశారని చెప్పి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి… టీడీపీ చేతికి సరికొత్త అస్త్రం అందించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. వందల కోట్లు ఖర్చు చేసినా… పులివెందులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ నీళ్లు ఇవ్వలేకపోయారని… కేవలం నిధులు మాత్రమే దండుకున్నారని ఆరోపించేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. మొత్తానికి జగన్ సోదరుడు, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి చంద్రబాబు ఊహించని విధంగా షాక్ ఇచ్చారని అర్థమవుతోంది.

Read More:

రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

శాత‌క‌ర్ణిపై రాజ‌మౌళి రివ్యూ

శాత‌క‌ర్ణిలో పెద్ద మైన‌స్

బాల‌య్య‌కు అక్క‌డ అదిరిపోయే షాక్‌

మురుగ‌దాస్‌ను హ‌ర్ట్ చేసిన ఖైదీ నెంబ‌ర్ 150

బాల‌య్య థియేట‌ర్లో ఎలా ఎంజాయ్ చేసాడో తెలుసా

Gautamiputra Satakarni review, rating, live updates, public talk

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *