టీడీపీ ఎమ్మెల్యేపై భూ క‌బ్జా కేసు

ఏపీలో అధికార టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు వ‌రుస‌గా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. దీనిపై చంద్ర‌బాబు వారికి వార్నింగ్‌లు ఇస్తున్నా వారి తీరు మాత్రం మార‌డం లేదు. రెండు రోజుల క్రితం గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్ రావి వెంక‌టేశ్వ‌ర‌రావు తుపాకీ మిస్ ఫైర్ కావ‌డం,ఇక బాప‌ట్ల‌లో ఎమ్మెల్సీ అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్ సైతం సూర్య‌లంక బీచ్‌లో రిసార్ట్ మేనేజ‌ర్‌పై దాడి చేసి కాంట్ర‌వర్సీగా వార్త‌ల్లో కెక్కారు.

ఇక ఈ కేసులో స‌తీష్ ప్ర‌భాక‌ర్‌పై కేసు కూడా న‌మోదైంది. ఈ రెండు సంఘ‌ట‌న‌లు జ‌రిగిన వెంట‌నే చంద్ర‌బాబు వీరిని త‌న వ‌ద్ద‌కు పిలిపించుకుని క్లాస్ పీకిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు ఉదంతాలు మ‌రువ‌క ముందే ఇప్పుడు మరో టీడీపీ ఎమ్మెల్యే భూ క‌బ్జా వివాదంలో చిక్కుకున్నారు. ఈ విష‌యంలో ఆయ‌న‌పై కేసు కూడా న‌మోదైంది.

విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ పెందుర్తిలో తన స్ధలం పక్కనే ఉన్న మరొకరి స్ధలాన్ని ఆక్రమించేందుకు యత్నించారు. బాధితుడి స్ధలంలో ఉన్న కట్టడాలను ఎమ్మెల్యే అనుచరులు కూల్చివేశారు. దీంతో గల్ఫ్ దేశంలో ఉన్న బాధితుడు ఈ మెయిల్ ద్వారా సీపీకి ఫిర్యాదు చేశాడు. గోవింద్, అతని కుమారుడు శ్రీకాంత్, పీఏ రమేష్‌పై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ వ‌రుస వివాదాలు టీడీపీతో పాటు చంద్ర‌బాబుకు మైన‌స్‌గా మారాయి. ఇక‌పై అయినా ఇలాంటి కాంట్ర‌వర్సీల్లో చిక్కుకున్న వారికి చంద్ర‌బాబు మ‌రింత‌గా స్ట్రాంగ్‌గా వార్నింగ్‌లు ఇవ్వ‌క‌పోతే అది విప‌క్షాల‌కు వ‌రంగా మారే ప్ర‌మాదం ఉంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *