కట్టు కథల ‘కాకాని’ గుట్టు రట్టు

కొద్ది రోజుల క్రితం మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. సోమిరెడ్డిపై ఆరోపణల పర్వాన్ని కొద్ది రోజుల పాటు కొనసాగించిన కాకాని గోవర్ధన్ రెడ్డి… ఆయనకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం కాకుండా… అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ వాటిని మీడియా ముందు పెట్టారు. వాటిని పోలీసులకు సైతం అందజేశారు. దీంతో ఒక దశలో సోమిరెడ్డి డిఫెన్స్ లో పడిపోయారనే ప్రచారం కూడా సాగింది. అయితే కాకాని చూపించిన ఆధారాలన్నీ ఉత్తవే అని… అవన్నీ కొందరు సృష్టించినవే అని తేలిపోయింది.

నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్పీ విశాల్… ఇందుకు సంబంధించిన వివరాలను బయటపెట్టారు. వీటిపై సోమిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు… ఈ నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించిన వారి అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన చిత్తూరు జిల్లావాసి మణిమోహన్‌ అలియాస్‌ చిరంజీవి, పి. వెంకటకృష్ణనన్‌, హరిహరన్‌ అరెస్ట్‌ చేశారు. వీరి వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలు విచారణలో తేలుతాయని అన్నారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యే కాకాని చేసిన ఆరోపణల గుట్టు ఇంత తొందరగా వీడిపోవడం సోమిరెడ్డితో పాటు టీడీపీకి కూడా పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *