రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన శాత‌క‌ర్ణి టిక్కెట్ రేటు

బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే శాత‌క‌ర్ణి సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా హిట్ టాక్ రావ‌డంతో బాల‌య్య అభిమానుల‌, నంద‌మూరి అభిమానుల ర‌చ్చ‌కు అంతేలేదు.

ఇదిలా ఉంటే ఈ సినిమా టిక్కెట్టును కూక‌ట్‌ప‌ల్లి భ్ర‌మ‌రాంబ థియేట‌ర్‌లో రికార్డు రేటుకు కొన్న ఓ బాల‌య్య వీరాభిమాని ఆ మొత్తాన్ని ఓ మంచి ప‌నికోసం విరాళంగా ఇచ్చాడు. శాత‌క‌ర్ణి బెనిఫిట్ షో చూసేందుకు బాల‌య్య వీరాభిమాని గోపీచంద్ ఇన్నమూరి అక్షరాలా ఒక లక్షా వంద రూపాయలు ఖర్చు పెట్టాడు. హైదరాబాద్ భ్రమరాంబా థియేటర్ లో ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ కోసం ఇంత మొత్తం చెల్లించి బాలయ్యపై తన అభిమానాన్ని ఈ విధంగా చూపించాడు.

గోపీచంద్ ఈ లక్షరూపాయలను బెనిఫిట్ షో నిర్వాహకులు ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా అందజేయనున్నారు. ఈ సినిమా ప్రీమియర్ షో నిర్వాహకులైన “మన బాలయ్య డాట్ కాం” నవీన్ మోపర్తి… ఈ టికెట్ ను హీరో నారా రోహిత్ చేతులమీదుగా బాలయ్య అభిమాని గోపీచంద్ ఇన్నమూర్తికి అంద‌జేశారు.

Read More:

రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

శాత‌క‌ర్ణిపై రాజ‌మౌళి రివ్యూ

శాత‌క‌ర్ణిలో పెద్ద మైన‌స్

రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన శాత‌క‌ర్ణి టిక్కెట్ రేటు

బాల‌య్య‌కు అక్క‌డ అదిరిపోయే షాక్‌

మురుగ‌దాస్‌ను హ‌ర్ట్ చేసిన ఖైదీ నెంబ‌ర్ 150

Gautamiputra Satakarni review, rating, live updates, public talk

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *