మరో డివోషనల్ మూవీలో నాగ్ ?

nag-34567

‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీ సాయి’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ స్టార్ హీరో… త్వరలోనే ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే దర్శకేంద్రుడు లేకుండా నాగార్జున ముఖ్యపాత్రలో మరో డివోషనల్ మూవీకి గ్రౌండ్ వర్క్ జరుగుతోందని ఇండస్ట్రీలో గుసగుసలు జోరందుకున్నాయి. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాకు రచయితగా వ్యవహరించిన జె.కె. భారవి… నాగార్జున హీరోగా ఇస్కాన్ ఫౌండర్ శ్రీ ప్రభుపాద జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు టాక్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కథను భారవి.. నాగార్జునకు వినిపించాడని… ‘ఓం నమో వేంకటేశాయ’ విడుదలైన తరువాత దీనిపై నాగార్జున ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి నాగార్జున కోసం మరో భక్తి రస చిత్రం వెయిట్ చేస్తోందని చెప్పొచ్చు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *