మురుగ‌దాస్‌ను హ‌ర్ట్ చేసిన ఖైదీ నెంబ‌ర్ 150

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్‌ 150’ చిరు కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కింది. వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కింది. అక్క‌డ క‌త్తి సినిమాను డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ అత్యద్భుతంగా తెరకెక్కించాడు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అదే సినిమాను ఇక్క‌డ చిరు రీమేక్ చేయ‌డంతో ఒరిజిన‌ల్ క‌త్తికి తెలుగు వెర్ష‌న్ ఖైదీ నెంబ‌ర్ 150కు చాలా మంది పోలీక‌లు పెడుతూ వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఖైదీలో బ‌ల‌వంతంగా కామెడీ ఇరికించ‌డంతో అక్క‌డ క‌త్తిలో ఉన్న ఫీల్ ఇక్క‌డ మిస్ అయ్యింద‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. ఇక ఈ క్ర‌మంలోనే తాను తమిళ్‌లో డైరెక్ట్ చేసిన క‌త్తి సినిమాను ఇక్క‌డ చిరు చేయ‌డంతో ఆస‌క్తితో ఉన్న మురుగ‌దాస్ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాను తొలి రోజే చూశాడు.

ప్ర‌స్తుతం మురుగ‌దాస్ మహేష్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పనుల నిమిత్తం ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నాడు. ఆయన ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాను తొలిరోజే హైదరాబాద్‌లో చూశాడు. సినిమా చూసిన మురుగ‌దాస్ కొన్ని సీన్ల‌కు బాగా హ‌ర్ట్ అయ్యాడ‌ని స‌మాచారం.

మురుగ‌దాస్ సినిమాల్లో ఆల్కహాల్‌ సీన్లు దాదాపుగా ఉండవు. ఆయన సినిమాల్లో విలన్‌ కూడా టీ, కాఫీలే తాగుతాడు. అలాంటిది ఈ రీమేక్‌ సినిమాలో హీరోయే లిక్కర్‌ సీన్లు చేయడం మురుగదాస్‌కు నచ్చలేదట. అలాగే అలీకి ఆడవేషం వేసి సృష్టించిన కామెడీ కూడా ఆయనకు సంతృప్తి కలిగించలేదని, చిరు మాత్రం బాగా చేశాడ‌ని మురుగ‌దాస్ త‌న స‌న్నిహితుల‌తో అన్న‌ట్టు స‌మాచారం.

Read More:

రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

శాత‌క‌ర్ణిపై రాజ‌మౌళి రివ్యూ

శాత‌క‌ర్ణిలో పెద్ద మైన‌స్

రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన శాత‌క‌ర్ణి టిక్కెట్ రేటు

బాల‌య్య‌కు అక్క‌డ అదిరిపోయే షాక్‌

మురుగ‌దాస్‌ను హ‌ర్ట్ చేసిన ఖైదీ నెంబ‌ర్ 150

Gautamiputra Satakarni review, rating, live updates, public talk

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *