గౌతమి పుత్ర శాత‌క‌ర్ణి సూప‌ర్ అంటోన్న మెగా హీరో

balayya-1234

బాలకృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన ఆయ‌న వందో చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ నేడు థియేటర్లలోకి వచ్చింది. బాల‌య్య కేరీర్‌లో వందో సినిమాగా తెర‌కెక్క‌డంతో పాటు, శాత‌వాహ‌న రాజుకు సంబంధించిన చ‌రిత్ర కావ‌డంతో బాలయ్య అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

శాత‌క‌ర్ణికి రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ క‌ర్ణాట‌క‌లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ప్రతి తెలుగోడూ గర్వంగా ఫీలయ్యేలా సినిమా తెరకెక్కిందని అభిమానులు అంటున్నారు. శాత‌క‌ర్ణి సినిమాను ఇప్ప‌టికే రాజ‌మౌళి, వ‌ర్మ వంటి ప్ర‌ముఖులు గొప్ప సినిమా అంటూ ఆకాశానికి ఎత్తేశారు.

షాకింగ్ మ్యాట‌ర్ ఏంటంటే మెగా ఫ్యామిలీకి చెందిన ఓ హీరో శాత‌క‌ర్ణి సినిమాకు సూప‌ర్ రెస్సాన్స్ వ‌స్తోందంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.

బాలయ్యను పొగుడుతూ ఆశ్చర్యకర ట్వీట్‌ చేశాడు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు సంబంధించి అద్భుతమైన రిపోర్ట్స్‌ వస్తున్నాయని, చిత్ర యూనిట్‌ మొత్తానికి అభినందనలని ట్వీట్‌ చేశాడు. అంతే కాదు బాలయ్య, క్రిష్‌లు తమలాంటి వారందరికీ స్ఫూర్తి అని కూడా అన్నాడు.

శాత‌క‌ర్ణికి పోటీగా త‌న మేన‌మామ ప్రెస్టేజియ‌స్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 రిలీజ్ అయినా కూడా సాయిధ‌ర‌మ్ శాత‌క‌ర్ణిని మెచ్చుకోవ‌డం ఇండ‌స్ట్రీలో ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణానికి మంచి నిద‌ర్శ‌నం.

Read More:

రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

శాత‌క‌ర్ణిపై రాజ‌మౌళి రివ్యూ

శాత‌క‌ర్ణిలో పెద్ద మైన‌స్

 గౌతమి పుత్ర శాత‌క‌ర్ణి సూప‌ర్ అంటోన్న మెగా హీరో

జగన్ తమ్ముడికి చంద్రబాబు షాక్

బాల‌య్య థియేట‌ర్లో ఎలా ఎంజాయ్ చేసాడో తెలుసా

Gautamiputra Satakarni review, rating, live updates, public talk

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *