బాల‌య్య థియేట‌ర్లో ఎలా ఎంజాయ్ చేసాడో తెలుసా

బాల‌య్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి గంట గంట‌కు టాక్ పెంచుకుంటూ పోతోంది. ఈ సినిమాను బాల‌య్య హైద‌రాబాద్ కూకట్ పల్లిలోని ‘భ్రమరాంబ’ థియేటర్లో త‌న అభిమానులతో కలిసి సినిమా చూశారు. బాలయ్య రాకతో అభిమానులు కెరింతలు కొట్టారు. ప్రముఖ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తదితరులతో కలిసి ఆయన సినిమా చూశారు.

సినిమా చూస్తున్నంత సేపు బాల‌య్య ఎంజాయ్ మామూలుగా లేదు. బాల‌య్య అభిమానుల‌తో పాటు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సినిమా అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. స్వయంగా బాలయ్యే సినిమా చూడటానికి రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాణసంచా పేళుల్లతో సంబరాలతో థియేటర్ ప్రాంగణం మారుమ్రోగిపోగా.. స్వయంగా బాలకృష్ణ ప్రత్యక్షం అయ్యేసారికి వారి సంబరాలను తారాస్థాయికి వెళ్లిపోయాయి.

ఇక ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ లో చిత్ర దర్శకుడు క్రిష్, కథానాయిక శ్రియా సినిమాను ప్రేక్షకులతో కలిసి చూశారు. గొప్ప తెలుగుయోధుడిని జీవితచరిత్రను సినిమాగా మలిచామని, ఈ సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వస్తుండటం థ్రిల్లింగ్ గా ఉందని క్రిష్ అన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఓవ‌ర్సీస్‌లో నంద‌మూరి అభిమానుల జోష్ మామూలుగా లేదు.

Read More:

రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

శాత‌క‌ర్ణిపై రాజ‌మౌళి రివ్యూ

శాత‌క‌ర్ణిలో పెద్ద మైన‌స్

రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన శాత‌క‌ర్ణి టిక్కెట్ రేటు

బాల‌య్య‌కు అక్క‌డ అదిరిపోయే షాక్‌

మురుగ‌దాస్‌ను హ‌ర్ట్ చేసిన ఖైదీ నెంబ‌ర్ 150

Gautamiputra Satakarni review, rating, live updates, public talk

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *