శాత‌క‌ర్ణిలో పెద్ద మైన‌స్

బాలయ్య అభిమానులు దేశం మీసం తిప్పుతున్నారు. అఖండ భార‌తావ‌ని జ‌య‌హో శాత‌క‌ర్ణి అని కీర్తిస్తోంది. బాల‌య్య 100వ సినిమా గౌతమిపుత్ర శాత‌క‌ర్ణి ప్రీమియ‌ర్ షో అలా ప‌డిందో లేదో జై బాలయ్య… జైజై బాలయ్య అనే నినాదంతో థియేటర్లు మారుమోగుతున్నాయి. అమరావతిని పరిపాలించిన శాతకర్ణి జీవిత కథ ఆధారంగా కథను నమ్ముకుని సినిమా తీసే దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

బెన్‌ఫిట్ షో చూసిన అభిమానులు మరోసారి బాలయ్యే సంక్రాంతి హీరో అంటున్నారు. నంద‌మూరి, బాల‌య్య అభిమానులే కాదు కామ‌న్ ఆడియెన్స్ సైతం బాల‌య్య కేరీర్‌లోనే శాత‌క‌ర్ణి ఓ మ‌ర‌పురాని చిత్రం అవుతుంద‌ని కీర్తిస్తున్నారు. శాతకర్ణి సినిమాకు డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయట. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఈ సినిమాలో గౌరవం దక్కిందని ప్రేక్షకులు చెబుతున్నారు.

ఇక సినిమాలో ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్, బాల‌య్య యాక్ష‌న్ హైలెట్ అయ్యాయి. ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులు ఓ విష‌యంలో మాత్రం చాలా లోటుగా ఫీల్ అవుతున్నారు. సినిమా ర‌న్ టైం చాలా త‌క్కువుగా..ఉంద‌ని సినిమా ఇంకా ఉంటే బాగుండేద‌ని చాలా మంది అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. హిస్టారిక‌ల్ స్టోరీతో ఉన్న సినిమాల నిడివి త‌క్కువుగా ఉండ‌డం స‌హ‌జం.

అయితే శాత‌క‌ర్ణి సినిమాను చాలా త‌క్కువ ర‌న్ టైంలో గ్రిప్పింగ్‌తో బోరింగ్ లేకుండా తీసిన విధానానికి అంద‌రూ ఫిదా అవుతున్నారు. ఎమోషనల్ సీన్స్‌లో బాలయ్య నటనకు ఎవరూ సాటిరారని చెబుతున్నారు. ఎకిమీదా, శివన్న పాటలు వీక్షకులను మెప్పిస్తాయని ప్రేక్షకులు తెలిపారు. ఇక టాలీవుడ్ హిస్ట‌రీలో సైతం ఈ సినిమా ఓ చ‌రిత్ర లిఖించిన‌ట్టే అంటున్నారు.

Read More:

రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

శాత‌క‌ర్ణిపై రాజ‌మౌళి రివ్యూ

బాల‌య్య‌కు అక్క‌డ అదిరిపోయే షాక్‌

జగన్ తమ్ముడికి చంద్రబాబు షాక్

బాల‌య్య థియేట‌ర్లో ఎలా ఎంజాయ్ చేసాడో తెలుసా

మురుగ‌దాస్‌ను హ‌ర్ట్ చేసిన ఖైదీ నెంబ‌ర్ 150

Gautamiputra Satakarni review, rating, live updates, public talk

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *